కోహ్లీ భావి కెప్టెన్.. వచ్చే ప్రపంచ కప్ నాటికి..!: ఎర్రబెల్లి ప్రసన్న

మంగళవారం, 31 మార్చి 2015 (10:27 IST)
వచ్చే ప్రపంచ కప్ నాటికి భారత జట్టు సారథిగా విరాట్ కోహ్లీ ఉండవచ్చునని స్పిన్ దిగ్గజం ఎర్రబెల్లి ప్రసన్న అన్నారు. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు భావి కెప్టెన్ అని, ఇలాంటప్పుడు అతను జట్టు పైన ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలని ఎర్రబెల్లి ప్రసన్న సూచించారు.

ఎప్పటికైనా కోహ్లీ కెప్టెన్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటి నుండే అతను మరింత బాధ్యత తీసుకోవాలన్నారు. అంతేకాకుండా, అతను జట్టు ఒకే తాటి పైకి నడిపించే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలన్నారు.
 
ఆటలో దూకుడును తప్పుపట్టాల్సింది లేదన్నారు. అయితే, సంయమనం ముఖ్యమని ప్రసన్న అభిప్రాయపడ్డారు. కోహ్లీ మంచి ఆటగాడన్నారు. ప్రత్యర్థి జట్టును గౌరవించాలన్నారు. మనం ఎల్లప్పుడూ బౌలర్ల పైన పై చేయి సాధించకపోవచ్చునన్నారు. ఆత్మవిశ్వాసంతో ఆడటం చాలా అవసరమని, అయితే ఇతర ఆటగాళ్లను గౌరవించాలన్నారు. అతను ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుమ్యాచుల్లో బాగా ఆడాడన్నారు.
 
ఇటీవల ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లీగ్ నుండి జరిగిన మొత్తం ఎనిమిది మ్యాచులలో కోహ్లీ 305 పరుగులు చేశాడు. యావరేజ్ 50.83గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి