బీచ్ వాతావరణంలో, సముద్రపు ఒడ్డున బీచ్ వేర్‌లో యువరాజ్ సింగ్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఈ ఫోటోషూట్‌లో పలువురు అంతర్జాతీయ మహిళా మోడల్స్ పాల్గొనగా.. వారిలో ఓ మహిళా మోడల్ ఫోటో నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకర్షించింది. యువరాజ్ సింగ్‌తో ఉన్న ఆ ప్రత్యేక మహిళా మోడల్ పేరు అనాలియా ఫ్రేజర్.
యువరాజ్ సింగ్, అనాలియా ఫ్రేజర్ కలిసి కనిపించిన ఈ ఫోటోలు ఏ వ్యక్తిగత బంధానికి సంబంధించినవి కావు. అవి ఫైనో టెకీలా అనే అంతర్జాతీయ కంపెనీ యాడ్ క్యాంపెయిన్‌లో భాగమని తెలుస్తోంది. యువరాజ్ ఫోటోషూట్‌ను చూసిన ఆయన చిరకాల మిత్రుడు, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించిన తీరు నవ్వులు పూయించింది. తన స్నేహితుడిని ఆటపట్టిస్తూ హర్భజన్ ఇలా కామెంట్ చేశారు.