చెన్నైకి, కలిసిరాని ఐపీఎల్.. ధోనీ ఖాతాలో చెత్తగా మారింది..

సోమవారం, 2 నవంబరు 2020 (12:23 IST)
ఐపీఎల్-2020 మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అంతగా కలిసిరాలేదు. ఆఖర్లో మూడు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది కానీ అంతకు ముందు ఘోరమైన ఓటములను ఎదుర్కొంది. అలాగే ధోని కెరీర్‌లో అతి చెత్త ఐపీఎల్‌గా ఈ ఏడాది ఐపీఎల్ నిలిచింది. ఎంతగా అంటే ధోని బెస్ట్ ఇన్నింగ్స్ ఒకటి కూడా చూడలేకపోయారు క్రికెట్ అభిమానులు.
 
ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్‌లో ధోని ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి. ఇదే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లకపోవడానికి కారణమని చెప్తూ ఉన్నారు. 
 
ధోని తనదైన స్టైల్‌లో ఓ రెండు మ్యాచ్‌లను ఫినిషింగ్ చేసి ఉండి ఉంటే ఈ పాటికి ప్లే ఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఉండేది. ఇక ఎలాగూ ఇంకొన్ని నెలల్లో 2021 ఐపీఎల్ సీజన్ మొదలుకాబోతూ ఉండడంతో ధోని అప్పుడన్నా రాణిస్తాడని చెన్నై అభిమానులు భావిస్తూ ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు