పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమెలోని పట్టుదల, హార్డు వర్కు తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. కేవలం వాటితోనే తాను తిరిగి జట్టులో స్థానం సంపాదించగలిగానని అన్నారు.
ప్రొఫెషనల్ అథ్లెట్‌గా సానియా హార్డ్‌వర్క్, పట్టుదల కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆమె విజయాల స్పూర్తితో తాను కూడా ఆటపై దృష్టి పెట్టి జట్టులోకి విజయవంతంగా రీ ఎంట్రీ ఇచ్చానని చెప్పాడు. పర్యటనల్లో ఉన్నప్పుడు, క్రికెట్ విషయాల గురించి ఇతరులతో చర్చించాలని అనుకున్నాసానియానే తనకు కంఫర్ట్ జోన్లా అనిపిస్తుందన్నాడు.