నరైన్‌కు కష్టకాలంలో అండగా ఉంటాం: విండోస్ క్రికెట్ బోర్డు

మంగళవారం, 1 డిశెంబరు 2015 (17:37 IST)
వెస్టిండీస్ మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో.. నరైన్‌కు కష్టకాలంలో అండగా ఉంటామని విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ట్రినిడాడ్ దేశవాళీ క్రికెట్ లీగ్ ద్వారా నరైన్ తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇది నరైన్ అంతర్జాతీయ పునరాగమనానికి కచ్చితంగా ఉపయోగపడుతుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.
 
కాగా బౌలింగ్ చేస్తున్నప్పుడు మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని పరీక్షల్లో తేలడంతో నరైన్‌పై వేటు పడింది. అయితే, నరైన్‌కు కష్టకాలంలో అండగా ఉంటామని విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి