అయితే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఫలితంగా మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్‌ను కేటాయించారు. నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లగా, ఢిల్లీ ఇంటిబాట పట్టింది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంగా గేల్, యువీల మధ్య సరదా సన్నివేశం జరిగింది. యువీపై గేల్ బ్యాటెత్తి కొట్టబోగా, యువీ కూడా తప్పించుకుంటూ గెంతాడు. ఈ దృశ్యాన్ని స్టేడియానికి వచ్చిన అభిమానులు ఆసక్తిగా తిలకించారు.