కాగా, గత యేడాది అక్టోబరు నెలలో గీత (32)ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భందాల్చివుంది. ఈ నెలాఖరుకు అతడి భార్య గీతా బస్రా బిడ్డను ప్రసవించనుంది. తన మొదటి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నట్టు చెప్పారు.
పసిబిడ్డను ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి భార్యతో కలిసి ప్రి-నాటల్ క్లాసులకు వెళ్లినట్టు వెల్లడించాడు. తన బిడ్డ ఇంగ్లండ్‌లో పుడుతుందన్నారు. తమ కుటుంబంలోకి కొత్తగా రానున్న బుజ్జాయి కోసం షాపింగ్ మొదలు పెట్టానని భజ్జీ తెలిపాడు.