లంకేయులను 38 పరుగుల తేడాతో ఓడించింది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీ చేశాడు. అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ చేసిన 50 పరుగులు భారత్.. తన ప్రత్యర్థికి ఓ మోస్తరు స్కోరు నిర్దేశించడానికి కారణమైంది. సరిగ్గా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. వహిందు హసరంగ డిసిల్వా బౌలింగ్‌లో అతను అవుట్ అయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ పట్ల ద్రవిడ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కనిపించింది. అవుట్ అయిన తరువాత బూతుమాటను పలకడం, క్రీజ్‌లోనే నిల్చోవడం పట్ల రాహుల్ ద్రవిడ్ ఇరిటేట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.