ఎకానమీ క్లాసులో గుర్రుపెట్టి నిద్రపోయిన రాహుల్ ద్రవిడ్!!

వరుణ్

బుధవారం, 31 జులై 2024 (10:50 IST)
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టైటిల్‌‍ను కైవసం చేసుకుని దాదాపు నెల రోజులు అవుతుంది. ఈ గెలుపు భారతీయ క్రికెట్ అభిమానులను సంతోషంలో నింపింది. అయితే, ఫైనల్ విజయం అనంతరం టీమిండియా స్వదేశానికి తిరిగి రావడం కాస్త ఆలస్యమైంది. హరికేన్ కారణంగా విమానాలు రద్దవడంతో జట్టు బార్బడోస్‌లోనే రెండు రోజులు అక్కడే వేచిచూడాల్సి వచ్చింది. 
 
ఆ తర్వాత బీసీసీఐ చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు చేసి టీమిండియా న్యూఢిల్లీ చేరుకుంది. ఈ విమానంలో టీమిండియా ఆటగాళ్లే కాకుండా.. బార్బడోస్ చిక్కుకున్న కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ విమానంలోనే ప్రయాణించారు. అయితే ఆ ఫ్లైట్ ఆటగాళ్లు ఎవరూ 6 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోలేదని ఫ్లైట్ ప్రొడ్యూసర్ ఒకరు వెల్లడించారు. జర్నీకి సంబంధించిన వివరాలు తెలిపారు. కొద్దిదసేపు నిద్రపోవాలని భావించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎకానమీ క్లాస్‌లో నిద్రపోవాల్సి వచ్చిందని తెలిపారు. 
 
'6 గంటల కంటే ఎవరూ ఎక్కువసేపు నిద్రపోలేదని నేను అనుకుంటున్నాను. ఫ్లైట్‌లో ఎవరూ లేరు. అందరూ ఒకేచోటు కలిసి ఉన్నారు. క్రీడాకారులు మీడియా సభ్యులతో మాట్లాడారు. స్టార్ స్పోర్ట్స్ ఇంజనీర్లు ఆ విమానంలో ప్రయాణించారు. వారికి కూడా అదే విమానంలో ప్రయాణ సౌకర్యం కల్పించారు. రోహిత్ శర్మ చాలా సార్లు బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీ క్లాస్‌కు వచ్చి వెళ్తుండేవాడు. ఒక సమయంలో నిద్రపోవాలని భావించిన రాహుల్ ద్రావిడ్ వచ్చి ఎకానమీ క్లాస్‌లో 4- సీటర్ కోసం వెతికారు. కొద్దిసేపు పడుకున్నారు' అని ఫ్లైట్ ప్రొడ్యూసర్ పేర్కొన్నారు. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరినో సరదాగా తిట్టడం తనకు నిద్రలో వినిపించిందని అన్నారు. రోహిత్ శర్మ అక్కడే నిలబడి ఉండడం తనకు కనిపించిందని, రోహిత్ తన స్టైల్లో సరదాగా తిట్టాడని, ఆ సమయంలో హార్దిక్, రిషబ్ పంత్ వచ్చారని, వారంతా మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లేకుండా విమానంలో సందడి వాతావరణం కొనసాగిందని దీనిని బట్టి అర్థమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు