నిజమండీ బాబూ, గురువారం ఆ టీవీ చానెల్లో ప్రసారమైన ‘ఝలక్ దిఖలాజా’ కార్యక్రమంలో ఓ ముద్దుగుమ్మతో కలిసి ఇర్ఫాన్ డ్యాన్స్ చేశాడు. క్రికెట్ గ్రౌండ్లో క్లీన్ షేవ్ గా కనిపించిన ఇర్ఫాన్, టీవీ ప్రొగ్రామ్‌లో మాత్రం సోదరుడు యూసుఫ్లా కాస్తంత గడ్డంతో కనిపించాడు.
కాగా వన్డే, ట్వంటీ-20ల్లో ఇర్ఫాన్ పఠాన్ భారత్‌లోనే 8వ అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2003లో క్రికెట్లో అరంగేట్రం చేసి మంచి పేరు కొట్టేసిన ఇర్ఫాన్.. 2006 నుంచి ఫామ్ లేని కారణంగా జట్టులో స్థానం కోల్పోవడం ద్వారా మెల్లమెల్లగా క్రికెట్‌కు దూరమయ్యాడు.