లారెస్ స్పోర్ట్స్ అవార్డుల వేడుకలు: స్పెషల్ అట్రాక్షన్‌గా సచిన్!

శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (19:34 IST)
ప్రపంచ క్రీడా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లారెస్ స్పోర్ట్స్ అవార్డుల వేడుకల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. ఏప్రిల్ 15న షాంఘైలో జరిగే లారెస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సచిన్‌తోపాటుగా చైనాకు చెందిన ప్రముఖ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు యావో మింగ్‌, ఎన్‌ఎఫ్‌ఎల్‌ స్టార్‌ ఆటగాడు మార్కస్‌ అలెన్‌, దక్షిణాఫ్రికా రగ్బీ దిగ్గజాలు షాల్క్‌ బర్గర్‌, జీన్‌ డివిలియర్స్‌ తదితర ప్రముఖులు హాజరవుతారు.
 
భారత టెలివిజన్ చరిత్రలో 2015 ఐసిసి ప్రపంచకప్‌ రికార్డు సృష్టించింది. భారత్‌లో టీవీలో అత్యధిక మంది వీక్షించిన ఈవెంట్‌గా ఈ ప్రపంచకప్‌ నిలిచింది. సెమీఫైనల్స్‌ వరకు మొత్తం 63.5 కోట్ల మంది ఈ ప్రపంచకప్‌ను టీవీలో తిలకించారు. భారత్‌, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ను రికార్డు స్థాయిలో 30.9 కోట్ల మంది భారతీయులు చూశారు. ఈ ప్రపంచకప్‌లో ఎక్కువమంది చూసిన మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయడం కూడా రేటింగ్‌ పెరగడానికి ఉపయోగపడింది.

వెబ్దునియా పై చదవండి