షాహిద్ అఫ్రిది: 8000 పరుగులు 350 వికెట్లతో రికార్డు

బుధవారం, 4 మార్చి 2015 (17:42 IST)
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డు సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్, పూల్ బిలో భాగంగా పాకిస్థాన్-యూఏఈల మధ్య బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది రికార్డు సాధించాడు. ఆల్ రౌండర్‌గా అటు బ్యాట్‌తోనూ, ఇటు బాల్‌తోనూ ఒంటి చేత్తో పాకిస్థాన్‌కు ఎన్నో విజయాలను అందించిన షాహిద్ అఫ్రిది వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని సాధించాడు. 
 
వ్యక్తిగత స్కోరు 2 పరుగులకు చేరుకోగానే, షాహిద్ అఫ్రిది 8వేల పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. దీంతో వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని సాధించి, 350కు పైగా వికెట్లు తీసుకున్న ఏకైక ఆటగాడిగా షాహిద్ అఫ్రిది నిలిచాడు. ఇప్పటివరకు 395 వన్డేలాడిన షాహిద్ అఫ్రిది మొత్తం 8019 పరుగులు చేశాడు. ఇందులో 39 అర్ధ సెంచరీలు, 6 సెంచరీలు ఉండటం విశేషం. 

వెబ్దునియా పై చదవండి