ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చేశాడు. బాల్ ట్యాంపరింగ్ కేసులో పట్టుపడి ఏకంగా జట్టుకు దూరం కావడమే కాకుండా, ఒక యేడాది పాటు నిషేధానికి లోనయ్యాడు. దీంతో ఆయన విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లాడు. ఈ హాలిడే టూర్ ముగించుకుని తిరిగి స్వదేశానికి వచ్చాడు.
ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన స్పందన తెలియజేశాడు. 'తిరిగి స్వదేశం ఆస్ట్రేలియాకి రావడం చాలా సంతోషంగా ఉంది. బయట కొంత సమయం విశ్రాంతి నాకు దొరికింది. ఆ సమయంలో నా కోసం ఎన్నో ఈ-మొయిల్స్, లెటర్స్ వచ్చాయి. మీరు నాపై చూపించిన ప్రేమకు వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీకు నాపై తిరిగి నమ్మకం వచ్చేలా చేసేందుకు నేను కృషి చేస్తాను' అని వ్యాఖ్యానించాడు.
కాగా, ఈ కేసులో స్మిత్‌తో పాటు మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ కెమారూన్ బాన్‌క్రాఫ్ట్ కూడా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని నిషేధం ఎదురుకుంటున్న విషయం తెల్సిందే. స్మిత్, వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా యేడాది పాటు నిషేధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. ఈ ఘటనతో స్మిత్, వార్నర్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్పోయే అవకాశాన్ని కూడా కోల్పోయారు.