విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే... చేపలు, గొర్రె మాంసం ఆరగించడమేనట

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (08:34 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యం. ఎలాంటి ఫార్మెట్‌లోనైనా తనదైనశైలిలో బ్యాటును ఝుళిపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇందుకు కారణం... ఏమాత్రం పట్టు సడలని అతడి ఫిట్నెస్సే కారణమట. వారంలో ఐదు రోజుల పాటు తప్పనిసరిగా జిమ్ బాట పట్టే విరాట్... మిగిలిన రెండు రోజులు మాత్రం రెస్ట్ తీసుకుంటాడు. ఇక ఫిట్నెస్‌ను కాపాడుకోవడంలో ఆహారపు అలవాట్లను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడట. 
 
మరి ఫిట్నెస్ కోసం తీసుకుంటున్నాననే విషయంపై మాట్లాడుతూ మాట్లాడుతూ చేపలు, గొర్రెపిల్ల మాంసమే తన ఫిట్నెస్‌కు కారణమని అతడు చెప్పేశాడు. ఎక్కడికెళ్లినా ప్రతి రోజూ ఈ రెండు అతడి మెనూలో ఉండాల్సిందేనట. ఇక జంక్ ఫుడ్‌ను అతడు అసలే ముట్టడట. మ్యాచ్‌లు ఉన్నప్పుడు ప్రోటీన్ స్నాక్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాడట. ఇక స్మోకింగ్, డ్రింకింగ్ వంటి దురలవాట్లను అతడు తన దరి చేరనీయడట. 

వెబ్దునియా పై చదవండి