భారత క్రికెట్ జట్టు దిగ్గజం అనిల్ కుంబ్లేను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. ఇంతకీ ఎక్కడ, ఎందుకు ఢీకొడతారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల మేరకు, బీసీసీఐ జనరల్ మేనేజర్లలో ఒకరు సెహ్వాగ్‌ను సంప్రదించి, ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా సేవలందించిన ఆయన అనుభవం ఈ పదవికి ఉపకరిస్తుందని కూడా సదరు జీఎం సలహా ఇచ్చారని సమాచారం. కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా హెడ్ కోచ్ పోస్టుకు పోటీ పడవచ్చని వార్తలు వస్తున్నాయి.