షమీ భార్య మోడలింగ్ వీడియో వచ్చేసింది.. సినిమాల్లో నటిస్తుందా?

సోమవారం, 9 జులై 2018 (14:44 IST)
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. భర్తతో విబేధాల కారణంగా అతనితో దూరంగా వున్న హసీన్ మళ్లీ మోడలింగ్ రంగంలో తళుక్కుమంది. స్వతహాగా మోడల్‌ అయిన ఆమె కోల్‌కతాలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షమి కోసం తన కెరీర్‌ను దూరం చేసుకున్నానని తెలిపింది
 
అయితే అతను తనను ఒంటరిగా వదిలేశాడని, మళ్లీ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి తిరిగి మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టా. మొదట్లో పాత స్నేహితులకు ఫొన్‌ చేయాలంటే ఇబ్బందిగా అనిపించేదని హసీన్ తెలిపింది. కానీ తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో  పెట్టుకుని వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.
 
అదేవిధంగా మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఫొటోషూట్‌ చేసిన ఓ వీడియోను కూడా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇదిలాఉండగా జహాన్ సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

Hasin jahan I m pic.twitter.com/mXumuTAJRs

— Hasin Jahan (@HasinJahan4) July 7, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు