విరాట్ కోహ్లీ 8 పరుగులతో, కేఎల్ రాహుల్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 58 పరుగులు (10 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించారు.
రాహుల్, కోహ్లి ఆటలు కొనసాగించనున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌పై పాక్ పేసర్ షహీన్ అఫ్రిది భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అభినందించాడు. బుమ్రా సతీమణి ఇటీవలే నాలుగు రోజుల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అఫ్రిది బుమ్రా వద్దకు వచ్చి నవజాత శిశువుకు బహుమతి ఇచ్చి అభినందించాడు. ఇద్దరూ ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు.