కానీ ప్రపంచ కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం యశస్వి జైస్వాల్‌ను తీవ్రంగా బాధించింది. పైగా, ప్రపంచవిజేతలుగా అవతరించిన బంగ్లా కుర్రాళ్లు ఫైనల్ అనంతరం విజయగర్వంతో ప్రవర్తించిన తీరు జైస్వాల్‌ను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
ఈ ఆవేశంలోనే తనకు వరల్డ్ కప్‌లో ఇచ్చిన అవార్డును రెండు ముక్కలుగా చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై జైస్వాల్ కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ, ట్రోఫీని ముక్కలు చేయడం కొత్తేమీ కాదని, జైస్వాల్‌కు తన బ్యాటింగ్ పైనే శ్రద్ధ ఉంటుందని, ఇలాంటి ట్రోఫీల గురించి పెద్దగా పట్టించుకోడని వివరణ ఇచ్చారు.
దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చిన జైస్వాల్ బ్యాగేజీలో ట్రోఫీ రెండు ముక్కలుగా కనిపించిందని వార్తలు వస్తున్నాయి. కాగా ప్రపంచకప్ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో మొత్తం 400 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. టోర్నిలో టాప్ స్కోరర్‌గా జైశ్వాల్ నిలవగా..అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.