ధోనీ ఆటను చూస్తూ పెరిగాను.. అతనికి బౌలింగ్ చేయాలంటే..?

సోమవారం, 12 అక్టోబరు 2015 (12:38 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటను చూస్తూ పెరిగిన తాను, అతనికి బౌలింగ్ చేయాలంటే భయపడ్డానని దక్షిణాఫ్రికా బౌలర్ రబడా చెప్పాడు. ప్రపంచ బ్యాట్స్‌మన్లలో మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీకి ఎలా బంతులేయాలో అర్థం కాలేదని పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని రబడా తెలిపాడు.
 
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో స్లాగ్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి, చివరి ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన రబడా చివర్లో బౌలింగ్ చేసినప్పుడు భయపడ్డానని తెలిపాడు. అయితే ఎక్స్ ట్రా పేస్‌తో ధోనీని పెవిలియన్ బాట పట్టించానని రబడా తెలిపాడు. భారత్‌పై తొలి వన్డేలో తన ప్రదర్శనను ఆటగాళ్లంతా అభినందించడం తనకు తీపి జ్ఞాపకమని రబడా హర్షం వ్యక్తం చేశాడు.   

వెబ్దునియా పై చదవండి