అత్యంత ప్రభావపూరిత క్రీడాకారుడిగా సచిన్!

FILE
భారతీయ క్రీడా ప్రముఖుల్లో టీం ఇండియా బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ అత్యంత ప్రభావపూరిత క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. అరుదైన రికార్డులతో యువక్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన విషయం తెల్సిందే.

వార్షిక స్పోర్ట్స్ఇల్లుస్ట్రేటెడ్ పవర్ జాబితాలో మొత్తం 50 మందికి రేటింగ్ ఇవ్వగా, అందులో సచిన్‌కు మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత స్థానంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ, రెండో స్థానంలో లిక్కర్ బాస్ డాక్టర్ విజయ్ మాల్యాలు ఉన్నారు.

అలాగే, త్వరలో ఐసీసీ ఛైర్మన్ గిరిని చేపట్టనున్న కేంద్ర మంత్రి శరద్ పవార్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌లు నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. అలాగే, టాప్-50 జాబితాలో స్థానం పొందిన క్రీడాకారుల్లో టెండూల్కర్, సానియా మీర్జా, అభినవ్ బింద్రా, చర్చిల్ అతెమావో, శ్రీనివాస్ డెంపో‌లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి