ఆఖరి వన్డేలో పాక్ ఓటమి: సిరీస్ కివీస్ వశం

మంగళవారం, 10 నవంబరు 2009 (11:09 IST)
తటస్థ వేదిక అబుదాబీలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి వన్డేలో పాకిస్థాన్ జట్టు ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆ జట్టు ఓటమి పాలైంది.

తొలుత టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ వెట్టోరి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీస్ ఓపెనర్లు మెక్‌కల్లమ్, రెడ్మాండ్‌లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా, రెండో మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన మెక్‌కల్లమ్ మూడో మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో రాణించాడు. 78 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరుఫోర్లతో 76 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆ తర్వాత టేలర్ (44), మరో ఓపెనర్ రెడ్మాండ్ (21)లు మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ కుప్పకూలారు. ఒక దశలో 33.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఉన్న కివీస్ ఇన్నింగ్స్‌ను పాక్ స్నిన్నర్ సయీద్ అజ్మల్ కోలుకోని దెబ్బతీశాడు.

అజ్మల్ స్పిన్నర్ ధాటికి ఆ జట్టు కేవలం 47 పరుగుల తేడాతో అన్ని వికెట్లను కోల్పోయి 46.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 49.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఏడు పరుగుల తేడాతో మూడో మ్యాచ్‌లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది.

తొలి మ్యాచ్‌లో పాక్ జట్టు గెలుపొందగా, రెండు, మూడు మ్యాచ్‌లలో కివీస్ జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అమీర్ (పాకిస్థాన్), మ్యాచ్ ఆఫ్ ది సిరీస్‌ను మెక్‌కల్లమ్‌ను వరించింది.

వెబ్దునియా పై చదవండి