ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనున్న పాక్ క్రికెట్ టీం

ఆదివారం, 18 మే 2014 (14:52 IST)
File
FILE
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలను పాక్ జట్టు ఆడనుంది. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఏ జట్టూ ముందుకు రాని విషయం తెల్సిందే. ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తటస్థ వేదికగా చేసుకొని పాక్ జట్టు హోం సిరీస్‌లు ఆడుతూ వస్తోంది.

పూర్తి స్థాయి సిరీస్‌లు ఆడే అవకాశాలు లభించకపోయినా, అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పిసిబి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే శ్రీలంక టూర్‌ను ఖాయం చేసుకున్నట్టు పిసిబి ప్రకటించింది.

శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి)తో అవగాహన కుదిరిందని, లంకలో పాక్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడుతామని పీసీబీ అధికారి ప్రకటించాడు. ఈ టూర్‌లో భాగంగా ఆగస్టు 6 నుంచి గాలేలో తొలి టెస్ట్, 14 నుంచి కొలంబోలో రెండో టెస్టు మొదలవుతుంది. అదేవిధంగా మూడు వన్డేలు ఆగస్టు 23, 27, 30 తేదీల్లో నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి