ఆసీస్ శుభారంభం : రాణించిన మైకేల్ క్లార్క్ రోజర్స్

FILE
రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి వెనకబడ్డా సిరీస్‌ గెలుచుకోగల దమ్ము తమ జట్టుకు ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో డాన్‌ బ్రాడ్‌మన్‌ సారథ్యంలో ఆసీస్‌ ఈ ఘనత సాధించింది. ఆసీస్‌ ఆ స్థాయిలో రాణిస్తుందా, లేదా అన్నది అప్రస్తుతమైనప్పటికీ గురువారం నాడిక్కడ ప్రారంభమైన మూడో టెస్టులో శుభారంభం చేసింది.

ముఖ్యంగా కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ బ్యాడ్‌ఫామ్‌ నుండి బయటపడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు 53 ఓవర్లు ముగిసే సమయానికి, అంటే టీ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

రోజర్స్‌ మరోమారు రాణించి 84 పరుగులు చేశాడు. షేన్‌ వాట్సన్‌తో కలసి తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వాట్సన్‌ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. రోజర్స్‌ సెంచరీకి చేరువవుతున్న దశలో డిఆర్‌ఎస్‌ మరోమారు ఆసీస్‌ను దెబ్బతీసింది. స్వాన్‌ బౌలింగ్‌లో అతడు ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. అతడి స్కోరులో 14 బౌండరీ లున్నాయి. అతడు 114 బంతులను ఎదుర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి