ఆస్ట్రేలియాపై మెరుగ్గా రాణిస్తాం: కెప్టెన్ ధోనీ విశ్వాసం

పవర్ ప్లే సమయంలో త్వరత్వరగా వికెట్లను కోల్పోవడం ఆందోళన కలిగించే అంశమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. అయితే తమ తదుపరి మ్యాచ్‌లలో ఖచ్చితంగా మెరుగుపడుతామన్నారు.

ప్రస్తుతం భారత ఉప ఖండంలో జరుగుతున్న ప్రపంచ కప్‌లో భాగంగా వచ్చే గురువారం ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా మంచి ఆటతీరును ప్రదర్శిస్తామన్నారు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 29 పరుగులకే చివరి 9 వికెట్లను కోల్పోయిన భారత్... ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో 3 పరుగులకు 218 పరుగులు చేసిన జట్టు 268 పరుగులకు ఆలౌట్ అయింది. 31వ ఓవర్‌లో జహీర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ డెవన్ స్మిత్ అవుట్ కావడమే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని ధోని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ గురించి అడిగినపుడు మేం ఫలితం గురించి ఆలోచించకుండా సన్నాహంపై దృష్టి పెట్టామన్నాడు. సెంచరీ చేసి రెండు కీలక వికెట్లు తీసిన యువరాజ్‌ను భారత సారథిని ప్రత్యేకంగా అభినందించాడు.

వెబ్దునియా పై చదవండి