ఆస్ట్రేలియా జట్టులో సైమండ్స్ స్థానంలో వైట్

ఇంగ్లాండ్‌లో మద్యం సేవించి రబస చేసినందుకు ఆండ్ర్యూ సైమండ్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా స్వదేశానికి పిలిపించింది. సైమండ్స్‌కు ఈ తరహా వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించి సైమండ్స్ క్రికెట్ ఆస్ట్రేలియా మందలింపు చర్యలకు గురైయ్యాడు.

తాజాగా ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ కూడా తప్పతాగి సైమండ్స్ దూరమయ్యాడు. సైమండ్స్ స్థానంలో చేరేందుకు ఆస్ట్రేలియా జట్టు నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కామెరూన్ వైట్‌కు పిలుపు అందింది.

వైట్ ఇప్పటివరకు ఏడు అంతర్జాతీయ ట్వంటీ- 20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో మొత్తం 152 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 40. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్‌కు మరో 48 గంటల సమయం మాత్రమే ఉండగా కామెరూన్ వైట్‌కు పిలుపు అందడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి