ఆ ముగ్గురే నాకు ఆదర్శం: సచిన్ టెండూల్కర్

FILE
అంతర్జాతీయ క్రికెట్లో 20 సంవత్సరాల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ముగ్గురు బాలీవుడ్ దిగ్గజాలు ఆదర్శంగా నిలిచారట..!. భారత్‌లో కోట్లాది యువతకు ఆదర్శంగా ఉన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ కూడా ముగ్గురు బాలీవుడ్‌ దిగ్గజాలను ఆరాధిస్తానని చెప్పాడు.

బాలీవుడ్ దిగ్గజాలైన అమితాబ్‌, లతా మంగే ష్కర్‌, ఆశాబోస్లేలు తనకు ఆదర్శంగా నిలిచారని మాస్టర్ బ్లాస్టర్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి అమితాబ్‌ నటించిన ప్రతి చిత్రాన్ని తాను చూస్తానని, లతాజీ, ఆశాల గానంతో మైమరిచిపోతానని మాస్టర్‌ వెల్లడించాడు. అమితాబ్‌ నటించిన ‘అగ్నిపథ్‌’ సినిమాలోని డైలాగ్స్‌ తనకు ఇప్పటికి గుర్తున్నట్లు చెప్పాడు. అలాగే మరో బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తితో తనకు సన్నిహితం ఉందన్నాడు.

ఇంకా తనకు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని, గత ఏడాది న్యూజిలాండ్‌ పర్యటనలో ఉండగా, అస్కార్‌ అవార్డులు సాధించినందుకు ఎంతో గర్వపడ్డాను. రెహ్మాన్‌కు అభినందనలు కూడా తెలిపినట్లు ఈ 36 ఏళ్ల వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ చెప్పాడు. ఇక క్రికెటర్లలో తనకు లెజెండరీ ఆటగాళ్లు బ్రాడ్‌‌మన్‌, వివ్‌ రిచర్డ్‌‌సలంటే ఆరాధ్యులుగా నిలిచారని సచిన్ టెండూల్కర్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి