ఆ మ్యాచ్‌లో ఫిక్సింగా... ఇదో పెద్ద జోక్: బ్రాడ్ హడ్డిన్ ఎద్దేవా

FILE
అహ్మదాబాద్‌లో జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు నత్తనడకన బ్యాటింగ్ చేయడం ద్వారా స్పాట్ ఫిక్సింగ్ జరిగివుంటుందనే అనుమానాలతో ఐసీసీ ఈ మ్యాచ్‌ను పరిశీలించనున్నట్లు వస్తున్న వార్తలను బ్రాడ్ హడ్డిన్ ఎద్దేవా చేశాడు. జింబాబ్వే మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనడం పెద్ద జోక్ అంటూ హడ్డిన్ హేళన చేశాడు.

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనే వార్తను వింటుంటే నవ్వొస్తుందని హడ్డిన్ చెప్పాడు. వాట్సన్‌తో తన బ్యాటింగ్ మందకొడిగా జరగలేదని, నిదానంగా ఓపెనింగ్ బ్యాటింగ్ సాగిందని తెలిపాడు.

కాగా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో హడ్డిన్, వాట్సన్‌లు కలిసి తొలి రెండు ఓవర్లలో ఐదు పరుగులను, పది ఓవర్లలో 28 పరుగులు మాత్రమే సాధించగలిగారు. ఇందులో స్పాట్ ఫిక్సింగ్ జరిగివుండవచ్చునని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన ఆస్ట్రేలియా జట్టు నిర్వాహకుడు స్టీవ్ బెర్నాట్ ఈ వారంలో తాను విన్న బుద్ధితక్కువ వార్త ఇదేనన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందనడం నిజంగానే నవ్వు తెప్పిస్తోందని స్టీవ్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి