ఇకపై బేలింగ్ వేయగలనో? లేదో?: బ్రెట్ లీ

FILE
అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తింపజేసే ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్ లీ క్రికెట్ కెరీర్ అనిశ్చితిలో పడింది. ఇకపై బౌలింగ్ వేయగలనో? లేదో? అనే సంశయం బ్రెట్‌ లీలో తలెత్తింది.

గాయాలతో మ్యాచ్‌లకు దూరమవుతున్న బ్రెట్ లీ.. "ప్రస్తుతం నా పరిస్థితి హమనిస్తే ఏదైనా జరగవచ్చునిపిస్తోంది. వన్డేల్లో ఆడొచ్చు.. లేదా మరొక్క బంతిని కూడా వేయలేకపోవచ్చు" అని అన్నాడు. ఏదేమైనా ఇన్నాళ్ల క్రికెట్ కెరీర్‌పై సంతృప్తిగానే ఉన్నాను. అయితే ఇప్పుడే అంతా అయిపోయిందని చెప్పలేనని బ్రెట్ లీ వెల్లడించాడు.

ఇప్పటికే 310 టెస్టు వికెట్లు, 324 వన్డే వికెట్లు పడగొట్టిన బ్రెట్ లీ.. తన 13 ఏళ్ల కెరీర్‌లో 12సార్లు గాయాల బారినపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఇకపై బ్రెట్ లీ.. అంతర్జాతీయ టెస్టులు దూరమవడమే అతని కెరీర్‌కు మంచిదని ఆస్ట్రేలియా కోచ్ టిమ్ నిల్సన్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిదందే. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే.. బ్రెట్ లీ టెస్టులకు స్వస్తి చెప్పి, వన్డేల్లో ఆడాలని టిమ్ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి