ఇర్ఫాన్ పఠాన్‌పై వేటు: అక్రమ్ ఆశ్చర్యం

దక్షిణాఫ్రికాలో సెప్టెంబరులో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్‌లో టీం ఇండియా పేస్‌బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌కు భారత సెలెక్టర్లు చోటు కల్పించకపోవడంపై పాకిస్థాన్ బౌలింగ్ లెజెండ్ వాసిం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఎడమచేతివాటం బౌలర్ ప్రాబబుల్స్‌లో లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నాడు.

ఇర్ఫాన్ ఓ నాణ్యమైన బౌలర్. ఇందులో తనకెటువంటి సందేహం లేదని వాసిం అక్రమ్ చెప్పాడు. అతను త్వరలోనే తిరిగి టీం ఇండియాలోకి వస్తాడని నమ్మకం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్ నుంచి ఇర్ఫాన్‌ను తొలగించి ఉండాల్సింది కాదని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. నేనే సెలెక్టర్‌ను అయివుంటే ఇర్ఫాన్ జట్టులో ఉండేవాడని తెలిపాడు. ఇర్ఫాన్ వయస్సు 24 ఏళ్లే. దేశం తరపున ఆడేందుకు అతనికి వయస్సు ఇంకా చాలావుందని అక్రమ్ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి