ఐపీఎల్‌కు దూరం కావడం బాధాకరం: వాట్సన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో అంచె పోటీలకు గాయం కారణంగా దూరం కావడం చాలా బాధగా ఉందని ఆస్ట్రేలియా షేన్ వాట్సన్ అన్నాడు. అబుదాబీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ తర్వాత ఐపీఎల్ టోర్నీలో పాల్గొనాలని వాట్సన్‌తో సహా జేమ్స్ హోప్స్, నాథన్ బ్రాకెన్‌లు ఉవ్విళ్ళూరారు.

అయితే, వైద్య పరీక్షల పేరుతో వీరి ఆశలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. ఫిట్‌నెస్‌ పరీక్షల్లో వీరికి మరింత విశ్రాంతి అవసరమని వైద్యలు తేల్చారు. ఫలితంగా ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ బోర్డు నిరాకరించింది. తొలి సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యవహించిన షేన్‌ వాట్సన్ ఈసారి పూర్తి సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

ఒంటి చేత్తో జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టిన అతని సేవలు లేక పోవడం రాజస్థాన్ జట్టుకు పెద్ద లోటుగా కనిపిస్తోంది. అద్భుత ఆటతో ఐపిఎల్‌ టోర్నీకే వన్నే తెచ్చిన వాట్సన్‌ మెరుపులు ఈ సారి అందుబాటులో లేక పోవడం అభిమానులు కూడా పెద్ద లోటుగా భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి