ఐపీఎల్‌పైనే దృష్టి.. వరల్డ్ కప్ గురించి ఆలోచించట్లేదు!

శనివారం, 17 మే 2014 (10:30 IST)
FILE
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్‌పైనే తాను దృష్టి కేంద్రీకరించానని, 2015 వరల్డ్ కప్ గురించి ఆలోంచడం లేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన గంభీర్ ఈసారి ఐపిఎల్ ఆరంభంలో విఫలమైనప్పటికీ, ఆతర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

బుధవారం ముంబయి ఇండియన్స్‌తో కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ 14 పరుగులకే అవుటైనప్పటికీ, చక్కటి కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు.

50 లేదా అంతకు మించిన టి-20 మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలను సాధించిపెట్టిన మూడో కెప్టెన్‌గా గంభీర్ రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు.

మహేంద్ర సింగ్ ధోనీ 103, షోయబ్ మాలిక్ 50 విజయాలతో ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. గంభీర్ ఇప్పుడు మాలిక్ సరసన రెండో స్థానంలో చేరాడు.

ఐపిఎల్ కెప్టెన్‌గా అతను 73 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. 40 విజయాలు సాధించాడు. 32 పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

వెబ్దునియా పై చదవండి