ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు ఆడటంపై 14న నిర్ణయం!

సోమవారం, 10 అక్టోబరు 2011 (09:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనడంపై ఈ నెల 14న జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ కొత్త ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రాజీవ్ శుక్లా చెప్పారు.

2008 ముంబయిపై ఉగ్రవాద దాడులు జరిగినప్పటినుంచి ఐపిఎల్‌లో పాక్ క్రికెటర్లు పాల్గొనకపోవడం తెలిసిందే. అయితే అంతమాత్రాన పాక్ క్రికెటర్లను ఐపిఎల్‌లో శాశ్వతంగా ఆడనివ్వమని అర్థం కాదని శుక్లా స్పష్టం చేశారు. దీనిపై పాలక మండలి నిర్ణయం తీసుకోవలసి ఉందని వెల్లడించారు.

పాకిస్తాన్ రిఫరీల సేవలను ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాం. కొన్ని జట్ల ఫ్రాంచైజీలు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లను కోచ్‌లుగా కూడా తీసుకున్నాయి. అందువల్ల మొత్తంగా పాకిస్తాన్‌ను నిషేధించామని చెప్పడం సరికాదు. ఎవరినీ నిషేధించే ప్రసక్తే లేదు’ అని శుక్లా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి