ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ లలిత్ మోడీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదివారం రాత్రి సస్పెడ్ చేసింది. ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో మోడీని ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. దీంతో ఇన్నాళ్లు లలిత్ మోడీ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
కాగా.. ఆదివారం రాత్రి లలిత్ మోడీని పదవి నుంచి తొలగించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబైలో ఐపీఎల్ మూడో సీజన్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే లలిత్ మోడీని ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ పాలకమండలి సమావేశం సోమవారం సమావేశం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి తానే అధ్యక్షత వహిస్తానని లలిత్ మోడీ గతంలో తెలిపాడు. కానీ ఛైర్మన్‌ను పదవి నుంచి తప్పించాలని కంకణం కట్టుకున్న బీసీసీఐ, ఆయనను ఐపీఎల్ నుంచి వెలివేసింది.