ఐసీసీకి లీగల్ నోటీసు పంపిన పీసీబీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు పంపింది. తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను చెప్పాపెట్టకుండా రద్దు చేయడంతో ఆగ్రహించిన పీసీబీ.. ఐసీసీకి లీగల్ నోటీసులు పంపుతున్నట్టు పేర్కొంది.

భద్రత కారణాల సాకుతో పాక్‌లో జరగాల్సిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను ఐసీసీ ఇతర దేశాలకు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్‌ బోర్డు న్యాయ పోరాటానికి దిగింది. ఇందులో భాగంగానే ఐసీసీకి లీగల్ నోటీస్‌ను పంపించింది.

భద్రత కారణాలతో తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేసిన ఐసీసీ అదే సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌, శ్రీలంకలో మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తోందో వివరణ ఇవ్వాలని పీసీబీ కోరింది.

ఐసీసీ కావాలనే పాకిస్థాన్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేసిందని పాక్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. భారత్‌, శ్రీలంకలో కూడా ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి బాగలేదని, అయినా అక్కడ మ్యాచ్‌లను యథాప్రకారంగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించడం తమకు సమ్మతం కాదని పాక్ బోర్డు స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి