కోక్ కంపెనీతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న సచిన్!

ప్రముఖ శీతలపానీయ సంస్థతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఓ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఏ లిక్కర్ కంపెనీతో ఒప్పందానికి నో డీల్ చెప్పిన సచిన్ టెండూల్కర్, మేజర్ కోక్ కంపెనీతో 20 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

పెప్సీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి రెండున్నరేళ్ల క్రితం తప్పుకున్న సచిన్ టెండూల్కర్, మరో మేజర్ కూల్ డ్రింక్స్ కంపెనీ కోక్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడు. కొకక్కోలా కంపెనీతో సచిన్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చేనెల జరిగే వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో మాస్టర్ బ్లాస్టర్ పాల్గొంటాడు.

అంతకుముందు పెప్సీతో కుదుర్చుకున్న ఒప్పందం 2008 మేతో ముగిసింది. పెప్సీ ఒప్పందం నుంచి సచిన్ తప్పుకోవడం ద్వారా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ సరసన సచిన్ కూడా చేరాడు. తద్వారా యంగిస్థాన్ ప్రచారం కోసం యంగ్ సెలబ్రిటీలు రణ్‌బీర్ కపూర్, దీపికా పడుకునేలు పెప్సీకో బ్రాండ్‌కు అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు.

వెబ్దునియా పై చదవండి