క్లార్క్ అజేయ సెంచరీ : ఇంగ్లండ్ బౌలింగ్‌కు గట్టిదెబ్బ

FILE
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టులను చేజార్చుకున్న తర్వాత ఆస్ట్రేలియా జట్టు గాడిలో పడింది. గురువారం ఇక్కడ ప్రారంభమైన మూడో టెస్టులో ఆచితూచి బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలింగ్‌కు తగిన సమాధానమిచ్చింది.

ఓపెనర్లు వాట్సన్, రోజర్స్ తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించారు. 19 పరుగులు చేసిన వాట్సన్‌ను అలిస్టర్ కుక్ క్యాచ్ పట్టగా బ్రెస్నన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది.

ఉస్మాన్ ఖాజా కేవలం ఒక పరుగు చేసి అవుట్‌కాగా, రోజర్స్ 84 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద స్వాన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ మైకేల్ క్లార్క్ (నాటౌట్ 125), స్టీవెన్ స్మిత్ (నాటౌట్ 70) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను సమర్థంగా పోషించారు. వీరిద్దరి పోరాటంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది.

వెబ్దునియా పై చదవండి