గంగూలీ గొప్ప కెప్టెన్ : మాట మార్చేసిన స్టీవ్ వా!

FILE
కోల్‌కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ గొప్ప కెప్టెన్ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మాట మార్చేశాడు. గంగూలీ భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని ప్రశంసించాడు. జట్టులో పోరాట తత్వాన్ని పెంచిన ఘనత అతనికే దక్కుతుందని కితాబిచ్చాడు.

భారత క్రికెటర్లు దూకుడుగా ఆడడానికి గంగూలీనే కారణమని చెప్పాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, గంగూలీకి ప్రత్యర్థి కెప్టెన్లపై గౌరవం లేదని, టాస్‌కు ఆలస్యంగా రావడం అతనికి అలవాటని విమర్శించాడు. క్రికెట్‌లో పాటించాల్సిన కనీస మర్యాద కూడా అతనికి తెలియదని ధ్వజమెత్తాడు.

అయితే, బుధవారం అతను మాట మార్చేశాడు. గంగూలీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆసీస్ జట్టు రెండు వరుస పరాజయాల తర్వాత మూడో టెస్టును డ్రాగా ముగించడాన్ని స్వాగతించాడు.

వెబ్దునియా పై చదవండి