ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ సవరణ

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సవరించింది. దక్షిణాఫ్రికాలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని ముందుగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 5వరకు జరపాలని ఐసీసీ నిర్ణయించింది.

అయితే ఈ టోర్నీని రెండు రోజుల ముందే (22వ తేదీ నుంచి) ప్రారంభించనుంది. మ్యాచ్‌ల మధ్య ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఉండాలని వివిధ దేశాలకు చెందిన క్రికెట్ జట్లు కోరడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే టోర్నీ వేదికలను కూడా ఆటగాళ్లు అలసిపోని విధంగా ఐసీసీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. జొహన్నెస్‌బర్గ్ (వాండరర్స్), ప్రిటోరియా (సెంచూరియన్)లలో టోర్నీ మొత్తం మ్యాచ్‌లను నిర్వహిస్తారు.

జంట నగరాలుగా పిలువబడే ఈ సిటీల మధ్య దూరం చాలా తక్కువగా ఉండటంతో.. ఆటగాళ్లు పెద్దగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి