జట్టు ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన గౌతం గంభీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో ప్రారంభ పోటీలో భాగంగా తొలి మ్యాచ్‌లో జట్టు ఆటతీరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ శుక్రవారం చెన్నయ్‌లోని చిదంబరం స్టేడియంలో జరిగిన విషయం తెల్సిందే.

ఈ మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ.. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో తమ జట్టు ఆటతీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైడర్స్ జట్టు కేవలం రెండు పరుగుల తేడాతో ఓడింది.

154 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన కోల్‌కతా ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. తమ జట్టు బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు. అయితే తాము క్యాచ్‌లు అందుకోవటంలో కొంత మెరుగుపడాల్సి ఉందని అంగీకరించాడు.

కాగా, శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రత్యర్థి జట్టు ఇచ్చిన మూడు క్యాచ్‌లను జార విడిచి పెట్టారు. ఫలితంగా చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు 150 పరుగులను అధిగమించగలిగింది.

వెబ్దునియా పై చదవండి