టీ20తో శ్రీలంక టూర్‌ను ప్రారంభించనున్న అసీస్

ఆస్ట్రేలియా జట్టు శని, సోమవారాల్లో జరిగే ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లతో శ్రీలంక పర్యటనను ప్రారంభించనుంది. ఆస్ట్రేలియా జట్టు లంక టూర్‌‌లో ఐదు వన్డేలు, మూడు టెస్ట్‌లు కూడా ఆడనుంది. ఏడు వారాల పాటు సాగే ఈ పర్యటనను ట్వంటీ20 మ్యాచ్‌లతో ఆరంభించడం సరైన మార్గంగా భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ పేర్కొన్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం శ్రీలంక తర్వాత ఐదో స్థానంలో ఉన్న ఆసీస్ జట్టు పునర్‌వైభవం సాధించాలని భావిస్తున్నది. నాలుగు వన్డే ప్రపంచ కప్‌లను గెలిచిన ఆస్ట్రేలియా జట్టు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.

వన్డే, టెస్ట్ జట్టులో స్థానం పొందని ఆస్ట్రేలియా టీ20 సారధి కామెరూన్ వైట్ సోమవారం తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. పూర్తి స్థాయి టెస్ట్, వన్డే కెప్టెన్‌గా నియమించబడిన తర్వాత మైకెల్ క్లార్క్‌ సారధ్యం వహిస్తున్న తొలి సిరీస్ ఇదే.

వెబ్దునియా పై చదవండి