నన్ను జట్టు నుంచి తొలగించారా!: మైక్ హస్సీ షాక్

వన్డే ప్రపంచకప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టు నుంచి తొలగించడంపై మైక్ హస్సీ షాక్ తిన్నాడు. గాయం కారణంగా తనను జట్టు నుంచి తప్పించడంతో వన్డే ప్రపంచకప్‌లో ఆడే తన అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కోల్పోయేలా చేసిందన్నాడు.

కాలికి ఏర్పడిన గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నాను. ఫిబ్రవరి 19 నుంచి భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్న తనను జట్టు నుంచి తప్పించడంతో షాక్ తిన్నానన్నాడు.

ఇంకా జట్టు నుంచి తనను తొలగించిన విషయం "మింగలేని చేదు మందు"గా హస్సీ అభివర్ణించాడు. 2007వ సంవత్సరం ఆండ్రూ సైమండ్స్ గాయపడ్డాడు, అయితే సైమండ్స్‌ను జట్టులోనుంచి తొలగించలేదు. ఇంకా చెప్పాలంటే గాయంతోనే సైమండ్స్ 2007 ప్రపంచకప్ పోటీల్లో జట్టుకు విజయం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడని మైక్ హస్సీ ఎత్తిచూపాడు. ఇదే తరహాలో తాను కూడా రాణించాలనుకున్నా. కానీ తనకు ఆ అవకాశం చేజారిపోయింది.

నా వరకు వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించి వుంటా. మూడో మ్యాచ్ నుంచి పూర్తిగా సహజంగా ఆడివుండేవాడిని. అయితే సెలక్టర్లు ఎందుకు రిస్క్ తీసుకోవడమనుకున్నారు. సెలక్టర్లు తీరు చూస్తుంటే ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు త్వరలో ముగిసిపోనుందనే సంకేతాలు వెలువడుతున్నాయని హస్సీ ఆవేదన వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి