నేడు పాకిస్థాన్-న్యూజిలాండ్‌ మూడో వన్డే!

సోమవారం, 9 నవంబరు 2009 (13:06 IST)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి వన్డే సోమవారం అబుదాబీలో జరుగనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలా ఒక మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే సోమవారం జరుగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభంకానుంది.

ఇరు జట్ల వివరాలు..
న్యూజిలాండ్.. డేనియల్ వెట్టోరి, బ్రూమ్, బట్లర్, ఫ్రాంక్లిన్, గుప్తిల్, మెక్‌కల్లమ్, ఎన్.ఎల్.మెక్‌కల్లమ్, మిల్స్, ఓరమ్, రెడ్‌మాండ్, సౌతీ, స్టైరిష్, టేలర్, వాట్లింగ్.

పాకిస్థాన్.. యూనిస్ ఖాన్, అబ్దుల్ రజాక్, ఇఫ్తీకర్ అంజుమ్, ఇమ్రాన్ పర్హాత్, అక్మాల్, లతీఫ్, అమెర్, యూసఫ్, నవీద్ ఉల్ హాసన్, అజ్మల్, సల్మాన్ భట్, షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, ఉమర్ గుల్ వాహబ్ రైజ్.

వెబ్దునియా పై చదవండి