పంజాబ్ ఎలెవన్ కెప్టెన్సీ నుంచి యువీ తొలగింపు?

FILE
వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ-20లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్సీ నుంచి టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ నుంచి యువరాజ్ సింగ్ తొలగించినట్లు సమాచారం.

జట్టు నిర్వాహకుల వద్ద యువరాజ్ సింగ్ అమర్యాదగా ప్రవర్తించిన కారణంగానే కెప్టెన్సీ నుంచి యువీ తప్పించారని తెలిసింది. ఇంకా నిర్వాహం చెప్పిన మాటను యువరాజ్ జవదాటాడని అందుకే కెప్టెన్సీ నుంచి అతన్ని పంజాబ్ ఎలెవన్ జట్టు నిర్వాహకం తొలగించిందని సమాచారం.

ఇకపోతే.. యువరాజ్ సింగ్‌కు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో.. అతని స్థానంలో శ్రీలంక స్టార్ ఆటగాళ్లు శ్రీలంక కెప్టెన్ సంగక్కర లేదా మహేల జయవర్ధనేల్లో ఎవరేని ఒకరిని కెప్టెన్‌‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి