పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టు సారథిగా మిస్బా-వుల్-హక్!

FILE
షాహిద్ అఫ్రిది టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, కొత్తగా టెస్టు సారథ్య పగ్గాలు చేపట్టిన సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకోవడంతో పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా మిస్బావుల్‌హక్‌ను ఎంపిక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, మిస్బావుల్‌హక్ పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాదిలోనే పాక్ టెస్టు క్రికెట్‌ జట్టుకు మిస్బావుల్‌హక్‌తో పాటు నాలుగో కెప్టెన్‌ను ఎంపిక చేయడం గమనార్హం.

కాగా.. దక్షిణాఫ్రికాతో ఈ మాసాంతంలో జరుగనున్న టెస్టు క్రికెట్‌లో ఆడే జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. 15మంది సభ్యులతో కూడిన పాక్ టెస్టు క్రికెట్‌కు మిస్బావుల్‌హక్ కెప్టెన్సీ సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది.

ఇక పాకిస్థాన్ టెస్టు జట్టులో ఇమ్రాన్ ఫర్హత్, ఉమర్, షాఫిక్, యూసుఫ్, మిస్బా వుల్ హక్, ఉమర్ అక్మల్, అజర్ అలీ, సయ్యీద్ అజ్మల్, కనేరియా, అబ్ధుల్ రెహ్మాన్, హైదర్, ఉమర్ గుల్, తన్వీర్ అహ్మద్, మొహమ్మద్ సమీ, రియాజ్, సోహైల్ తన్వీర్‌లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి