ప్రపంచకప్‌‌లో బరిలోకి దిగే ఆటగాళ్ల ఫిట్‌నెస్ కీలకం: కుంబ్లే

FILE
సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగడం ఎంతో ముఖ్యమని భారత టెస్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

భారత ఉపఖండంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను మహేంద్ర సింగ్ ధోనీ సేన గెలుచుకునేందుకు ఓ మంచి సువర్ణావకాశమన్నాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్లు గాయాలు లేకుండా పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుంబ్లే తెలిపాడు.

గాయాల బాధ లేకుండా పూర్తి ఫిట్‌నెస్‌తో టీమిండియా ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగితే, కప్‌ను గెలుచుకోవడం సులభమని అనిల్ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయని కుంబ్లే వెల్లడించాడు. కాబట్టి భారత ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగి 1983కు తర్వాత వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవాలన్నాడు.

వెబ్దునియా పై చదవండి