ప్లీజ్.. మమ్మల్ని వదిలేయండి..!: షోయబ్ అక్తర్

PTI
భారత్-పాకిస్థాన్‌లకు చెందిన సెలబ్రిటీలు సానియా, షోయబ్ మాలిక్‌ల వివాహంపై మీడియాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయనే అంశం కొత్త పెళ్లికొడుకు షోయబ్ మాలిక్ కూడా బాగా తెలిసిపోయింది. అందుకే మీడియాలూ.. ఇక కవరేజీలు ఆపండి..! అన్నాడు. ఇంకా కొత్తగా పెళ్లైన మమ్మల్ని కాస్త ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్..! అంటున్నాడు.

షోయబ్ మాలిక్-సానియా మీర్జాల పెళ్లి తంతు, రిసెప్షన్ వంటి ప్రతి చిన్న విషయాన్నీ కవరేజ్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మీడియాపై షోయబ్ కాస్త మండిపడ్డాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో తన వివాహంపై మీడియాలు చేస్తున్న కవరేజీలు ఇక చాలంటున్నాడు. ఇంకా మమ్మల్ని ఒక సాధారణమైన జంటగా చూడండని షోయబ్ మీడియాను కోరాడు.

తమ వివాహానికి ముందు, తర్వాతి పెళ్లితంతుపై పాక్, భారత్ మీడియాలు బాగానే కవరేజీలు చేశాయని, ఇక తమ వివాహంపై కవరేజ్ చేయడం కాస్త ఆపుకోవాలని షోయబ్ కోరాడు. సానియాతో తన వివాహం జరగడంపై భారత్-పాక్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అయితే మీడియా కవరేజ్‌లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని షోయబ్ అన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా ఓ సాధారణ దంపతులుగానే చూడాలని కోరాడు.

తామిద్దరం పాకిస్థాన్ చేరుకున్న వెంటనే ఒకవైపు అభిమానులు ఆదరణ చూపారు. మరోవైపు మీడియాలు కవరేజ్‌ల కోసం ఎగబడటం చూస్తుంటే.. సానియాతో తాను భర్తకంటే.. ఎక్కువ సమయం పర్సనల్ బాడీ గార్డ్‌గా వ్యవహరించాల్సి వచ్చిందని మాలిక్ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి