బంగ్లా-వెస్టిండీస్‌‌ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం

బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభమైంది. కాంట్రాక్టు వివాదం పరిష్కరించేంతవరకు వన్డే, టెస్టు సిరీస్‌లను బహిష్కరిస్తున్నట్లు వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ (వైపా) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు విండీస్ బోర్డు ప్రత్యామ్నాయ జట్టును ప్రకటించింది.

కాగా.. తాజా జట్టుకు కెప్టెన్‌గా ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ ఫ్లాయిడ్ రీఫర్‌ను ఎంపిక చేసింది. ఇతను 1999లో చివరిసారిగా నాలుగు టెస్టులు ఆడి, ప్రస్తుతం దేశవాళీ మ్యాచుల్లో కంబైన్డ్ కళాశాల, క్యాంపస్ జట్ల తరపున ఆడుతున్నాడు.

ఇదిలా ఉండగా.. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు ఎట్టకేలకు గురువారం ఆరంభమైంది. కింగ్‌స్టన్ మైదానంలో గురువారం తొలిరోజు ఆటలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. తొలిరోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు సష్టపోకుండా 18.5 ఓవర్లకు 42 పరుగులు చేసింది.

ఇకపోతే.. విండీస్ జట్టులో ఫ్లాయిడ్ రీఫర్ (కెప్టెన్), ఒమర్ ఫిలిప్స్, డేల్ రిచర్డ్స్, ట్రావిస్ డౌలిన్, చాద్విక్ వాల్టన్ (వికెట్ కీపర్), డారెన్ సమీ, కెమర్ రోచ్, ర్యాన్ ఆస్టిన్, టినో బెస్ట్, కెవిన్ మెక్‌క్లీన్, నెలన్ పాస్కల్, ఆండ్రూ క్రెరీ, నికితా మిల్లర్, క్రెగ్ బ్రాత్ వైట్, డేవిడ్ బెర్నార్డ్‌లకు స్థానం దక్కింది.

వెబ్దునియా పై చదవండి