బుకీ మజీద్ సోదరుడితో పాక్ క్రికెటర్లకు సంబంధం..!?

FILE
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుకీ మజర్ మజీద్ సోదరుడితో పలువురు పాకిస్థాన్ క్రికెటర్లకు సంబంధం ఉందని తెలిసింది. ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న మజీద్ సోదరుడు అజర్ మాజీ, ప్రస్తుత పాకిస్థాన్ క్రికెటర్లతో ఫిక్సింగ్ సంబంధాలు కలిగివున్నట్లు సమాచారం.

పాక్ జట్టులోని పలువురు క్రికెటర్లకు అజర్ ఏజెంట్‌గా వ్యవహరించాడు. ఇతనితో కెప్టెన్ షాహిద్ అఫ్రిది, మొహమ్మద్ యూసుఫ్, అబ్ధుల్ రజాక్‌, ముస్తాక్‌లకు సంబంధాలున్నట్లు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

బుకీలుగా పిలువబడుతున్న మజీద్, అజర్‌లను పాక్ క్రికెటర్లకు పరిచయం చేసింది.. మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ అని తెలిసింది. అయితే మజీద్ తరహాలో తాను ఎలాంటి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారానికి పాల్పడలేదని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసుల వద్ద తెలిపినట్లు ఆ దేశ పత్రికలు వెల్లడించాయి.

ఇకపోతే.. ప్రముఖ బ్రిటీష్ పత్రిక బ్రిటీష్ టాబ్లాయిడ్ ప్రచురించిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో సల్మాన్ భట్, ఆసిఫ్, అమీర్‌ల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి