భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ షెడ్యూల్‌పై బీసీసీఐ గుర్రు!

బుధవారం, 10 జులై 2013 (17:56 IST)
File
FILE
దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించిన ఆ దేశ క్రికెట్ బోర్డు (సీఎస్ఏ)పై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండానే షెడ్యూల్ ఖరారు చేయడమేంటని మండిపడింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పందిస్తూ... సీఎస్ఏ వ్యవహరించిన తీరు అనుచితం. ఈ వ్యవహారంపై అధ్యక్షుడితో చర్చిస్తామని చెప్పారు. నవంబర్ 18న ప్రారంభమై రెండు నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో భారత్ రెండు టి-20, ఏడు వన్డే, మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

నవంబర్ 21 - తొలి టి-20 జొహాన్నెస్‌బర్గ్ (డే/నైట్)
నవంబర్ 24 - రెండో టి-20 కేప్‌టౌన్ (డే)
నవంబర్ 27 - తొలి వన్డే డర్బన్ (డే/నైట్)
నవంబర్ 30 - రెండో వన్డే పోర్ట్ ఎలిజబెత్ (డే)
డిసెంబర్ 3 - మూడో వన్డే ఈస్ట్ లండన్ (డే/నైట్)
డిసెంబర్ 6 - నాలుగో వన్డే సెంచూరియన్ పార్క్ (డే/నైట్)
డిసెంబర్ 8 - ఐదో వన్డే జొహాన్నెస్‌బర్గ్ (డే)
డిసెంబర్ 12 - ఆరో వన్డే బ్లూమ్‌ఫోంటీన్ (డే/నైట్)
డిసెంబర్ 15 - ఏడో వన్డే కేప్‌టౌన్ (డే)
డిసెంబర్ 26-30 - తొలి టెస్ట్ డర్బన్
జనవరి 2-6 - రెండో టెస్ట్ కేప్‌టౌన్
జనవరి 15-19 - మూడో టెస్ట్ జొహాన్నెస్‌బర్గ్.

వెబ్దునియా పై చదవండి