భారత హైకమీషనర్ కంటే ధోనీ ఛారిటీ ముఖ్యమా?

గురువారం, 28 జులై 2011 (09:14 IST)
లార్డ్స్ టెస్ట్‌లో భారీ తేడాతో ఓడిన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియాను మరో వివాదం చుట్టుముట్టింది. జులై 18న భారత హైకమీషనర్‌ ఏర్పాటు చేసిన విందుకు హాజరుకాకపోవడంపై భారత హైకమీషన్ విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేసింది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం పర్యటనకు వచ్చిన జాతీయ క్రికెట్ జట్టు భారత హైకమీషనర్ ఆహ్వానాన్ని తప్పక స్వీకరించాలి. అయితే ఈ విందును రద్దు చేసుకున్న భారత జట్టు సభ్యులు తన ఛారిటీకి నిధులు సేకరించేందుకు గానూ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అదే రోజు సాయంత్రం సెంట్రల్ లండన్‌లోని ఖరీదైన హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు.

దీంతో మనస్తాపం చెందిన హైకమీషనర్ నలీన్ సూరీ ఈ అంశాన్ని ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖకు నివేదించాలని నిర్ణయించారు. బీసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్‌ను ఈ అంశం గురించి వివరణ కోరగా తన దృష్టికి రాలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి